ప్రియుడు దూరమయ్యాడని.. విమానాన్నే..

తాజా వార్తలు

Published : 17/06/2020 01:12 IST

ప్రియుడు దూరమయ్యాడని.. విమానాన్నే..

చైనా: ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెట్టాడని భావోద్వేగానికి లోనైన ఓ యువతి ఏకంగా విమానం అద్దాన్ని పగలగొట్టింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. చైనాలో గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన 29ఏళ్ల యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే ఆ వ్యక్తి గత కొంతకాలంగా యువతిని దూరం పెట్టసాగాడు. దీన్ని తట్టుకోలేకపోయిన సదరు యువతి గత నెలలో విమానంలో ప్రయాణిస్తూ భావోధ్వేగానికి లోనైంది. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి తన చేత్తో విమానం కిటికీ అద్దాన్ని పగలగొట్టింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన తోటి ప్రయాణికులు ఆ యువతిని నియంత్రించేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని పైలట్‌ జెంగ్‌జోవ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. అనంతరం పోలీసులు నిర్వహించిన పరీక్షల్లో యువతి మద్యం సేవించినట్లు గుర్తించారు. సదరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం చైనా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని