50వేల పరీక్షలు ఎన్నిరోజుల్లో చేస్తారు?:సంజయ్‌

తాజా వార్తలు

Updated : 17/06/2020 14:56 IST

50వేల పరీక్షలు ఎన్నిరోజుల్లో చేస్తారు?:సంజయ్‌

హైదరాబాద్‌: కొండ పోచమ్మ చెరువును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం వల్ల నీళ్లు రాలేదు గానీ, కరోనా వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. ప్రారంభోత్సవ వేడుకలో భౌతిక దూరం పాటించకపోవడం వల్లే ఎమ్మెల్యేలు, అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆరోపించారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 

‘‘రాష్ట్రంలో 50 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎన్ని రోజుల్లో చేస్తారో స్పష్టం చేయాలి. 50 వేల పరీక్షలు చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? దిల్లీ ప్రభుత్వం చేతులెత్తేయడంతో కేంద్రం చొరవ తీసుకుంది. తెలంగాణపై కేంద్రం చొరవ తీసుకుంటే కేసీఆర్ బండారం బయట పడుతుందనే పరీక్షలు చేస్తామని ప్రకటించారు. గవర్నర్ గాంధీకి వెళ్లి పరిశీలించారు. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ విడిచి రావడం లేదు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి.. అది చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ను రాష్ట్రంలో అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 245 కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉంది’’ అని బండి సంజయ్‌ అన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని