INPICS: వీరుడికి కన్నీటి వందనం

తాజా వార్తలు

Published : 18/06/2020 10:38 IST

INPICS: వీరుడికి కన్నీటి వందనం

సూర్యాపేట: లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ సమీపంలో భారత్‌-చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యాపేట వాసి, కర్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ డి.అర్వింద్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్‌బాబు పార్థివహాన్ని సందర్శించి నివాళులర్పించారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు. సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. వేలాది మంది ప్రజలు కర్నల్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. స్థానికులు భవనాలపై నుంచి పూలు చల్లుతూ నివాళులర్పించారు. కరోనా వైరస్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పురపాలిక అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సైనిక సంస్కారాల ప్రక్రియలు 16 బిహార్‌ రెజిమెట్‌ బృందం పాల్గొంది.

సంతోష్‌ బాబు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి


కర్నల్‌ పార్థివదేహం వద్ద కుటుంబ సభ్యులు


కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు


 

కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌వందనం చేస్తున్న సైనికులు


వందనం చేస్తున్న కుటుంబ సభ్యులు
కర్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర


కర్నల్‌ సంతోష్‌బాబు అంతిమ యాత్ర


జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం తెలుపుతున్న స్థానికులు


అంతిమయాత్రఅంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన స్థానికులు


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని