అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

తాజా వార్తలు

Updated : 19/06/2020 13:32 IST

అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

విజయవాడ: టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాది కోరగా.. బెయిల్‌ పిటిషన్‌, కస్టడీ పిటిషన్‌పై ఒకేసారి వాదనలు వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

గతంలో కార్మికశాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ఆసమయంలో ఈఎస్‌ఐ ఆసుపత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోలు, టెలీ మెడిసిన్‌కు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత  అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి విజయవాడ వరకు రోడ్డు మార్గంలో తీసుకురావడంతో 12 గంటల పాటు కారులోనే ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ఆయనకు శస్త్రచికిత్స గాయం పెద్దదికావటంతో అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని