సత్యేంద్రజైన్‌కు ప్లాస్మాథెరపీ చికిత్స

తాజా వార్తలు

Updated : 20/06/2020 14:09 IST

సత్యేంద్రజైన్‌కు ప్లాస్మాథెరపీ చికిత్స

దిల్లీ: దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్రజైన్‌ (55) కరోనా వైరస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో దిల్లీలోని రాజీవ్‌ గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి నిన్న సాయంత్రం  ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం ప్లాస్మా థెరపీ చికిత్స అందించినట్లు సమాచారం.  నిన్న ఉదయం నుంచి సత్యేంద్రజైన్‌ జ్వరంతో పాటు హైబీపీతో బాధపడుతున్నారు. శ్వాసతీసుకోవడంలో కూడా ఇబ్బంది పడటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జ్వరం లేదని, 24 గంటలపాటు ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వెల్లడించారు.

మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆస్పత్రిలో చేరడంతో ఆ శాఖ బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అప్పగించారు. కరోనా నుంచి కోలుకునే వరకు ఆయన నిర్వహిస్తున్న శాఖల బాధ్యతలను సిసోడియా నిర్వహిస్తారు. ఈనెల 17న సత్యేంద్రజైన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని