టీఎస్‌ ‘పది’ విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు

తాజా వార్తలు

Updated : 22/06/2020 20:15 IST

టీఎస్‌ ‘పది’ విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులేనని... మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని వెల్లడించారు. గ్రేడ్లలో పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు తెలియజేయాలన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో ‘పది’ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని