ప్యాసింజర్‌ రైలుకు 24 బోగీలే ఉండాలా?

తాజా వార్తలు

Published : 22/06/2020 18:45 IST

ప్యాసింజర్‌ రైలుకు 24 బోగీలే ఉండాలా?

రైల్వేశాఖపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే.. వలస కూలీల కోసం ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. స్వస్థలాలకు వలస కూలీ తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిహార్‌కు చెందిన 45 మంది వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారని న్యాయవాది వసుధ నాగరాజ్తెలిపారు. దీంతో బిహార్ వెళ్లే రైలుకు అదనపు బోగీ ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.

ప్యాసింజర్ రైలుకు 24 బోగీలే ఉంటాయని... అదనంగా ఏర్పాటు చేయకూడదని రైల్వే శాఖ ప్రతినిధి తెలిపారు. అదనపు బోగీని ఏర్పాటు చేయడానికి ఏ చట్టం అడ్డుకుంటోందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్యాసింజర్ రైలుకు 25 బోగీలు ఉండకూడదనేందుకు ఏమైనా శాస్త్రీయ కారణాలున్నాయా? అని ప్రశ్నించింది. అయితే అదనపు బోగీలను రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని రైల్వే శాఖ న్యాయస్థానానికి తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే.. రైల్వేను తానే కోరతానని సీజే చౌహాన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ రేపు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని