మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 27/06/2020 20:02 IST

మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తెలిపారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు రూ.10కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 28న పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో వీక్షకులకు అనుమతినిస్తామన్నారు. 

‘‘పీవీ జయంతి వేడుకలను 50 దేశాల్లో నిర్వహిస్తాం. పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా అందిస్తాను. పార్లమెంట్‌లో పీవీ చిత్రపటం నెలకొల్పాలి. హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుకు కేకే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగరతోపాటు దిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. అలాగే శాసనసభలో పీవీ చిత్రపటం ఏర్పాటు చేస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని