ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 27/06/2020 16:09 IST

ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేటీఆర్‌ చర్చించారు. ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్, జీఐఎస్‌ మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. అర్హులైన పేదలకు భూములు క్రమబద్ధీకరించి హక్కులు కల్పించాలని చెప్పారు. దశాబ్దాల క్రితం లీజులను సమీక్షించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ కలసి పని చేయాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించడంపై పరిశీలించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని