ప్రధాని అయినా తండ్రిలాగే ఉండేవారు

తాజా వార్తలు

Published : 29/06/2020 01:42 IST

ప్రధాని అయినా తండ్రిలాగే ఉండేవారు

పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవితో ముఖాముఖి

ఇంటర్నెట్‌ డెస్క్‌: గంభీరమైన తీరు.. సున్నితమైన మనసు.. ముఖ్యంగా సాహిత్యం పట్ల ఎనలేని మక్కువ. అన్నింటికీ మించి దేశంలో విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ రాజకీయ చరిత్రలోనే సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుడు దివంగత మాజీ ప్రధాని పీవీ సరసింహారావు. ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఓ తండ్రిగా కుటుంబ పెద్దగా పీవీ ఇంట్లో ఎలా ఉండేవారు. పిల్లలతో ఎలా మసలుకునేవారు తదితర అంశాలను పీవీ కుమార్తె వాణిదేవి ఈటీవీతో ముచ్చటించారు. సన్యాసిగా ఎందుకు మారాలనుకున్నారు. దేశం ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్పప్పుడు వీపీ ప్రధానిగా మారారు. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన జీవితం ఎలా గడిచింది. లాంటి తదితర ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు. 

ఈటీవీ: ఆర్థిక సంస్కరణల పితామహుడు, దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ గారు ఇంట్లో ఒక తండ్రిగా ఎలా ఉండేవారు?
వాణిదేవి:  దేశ ప్రధానిగా ఉన్నప్పుడైన నాన్న సగటు తండ్రిలాగే ఉండేవారు. మాతో పాటే ఆయన అన్ని పండగలు జరుపుకొనేవారు. తను ఒక ప్రధాని అనే గర్వం, హోదా ప్రదర్శించేవారు కాదు. ఇంట్లోకి ప్రవేశించగానే సాధారణ కుటుంబసభ్యుడిలా మారిపోయేవారు.
ఈటీవీ: పీవీ గారికి కుబుంబంతో గడిపేంత సమయం ఉందేదా? మీతో ఎంత సమయం గడిపేవారు? 
వాణిదేవి: దేశ సంక్షేమం కోసం పరితపించిన మహనీయుడు మా నాన్న. మాతో గడపాల్సిన సమయం పడిపేవారు. ఆయన మాట మాకు ఆజ్ఞ లాంటిది. నాన్న ప్రవర్తన, పని తనాన్ని చూసే మేము పెరిగాం. అన్ని విషయాలు ఆయన నుంచే నేర్చుకున్నాం. 

ముఖాముఖిలోని మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు కింది వీడియోను చూడండి..
 

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని