పరీక్షా కేంద్రాల మార్పునకు UPSC అవకాశం
close

తాజా వార్తలు

Published : 02/07/2020 01:23 IST

పరీక్షా కేంద్రాల మార్పునకు UPSC అవకాశం

దిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాల మార్పునకు యూపీఎస్సీ అవకాశం కల్పించింది. కరోనా వల్ల పరీక్షాల కేంద్రాల మార్పు చేసుకోవడానికి అవకాశమిస్తున్నామని యూపీఎస్సీ తెలిపింది. ఈ నెల ఏడో తేదీ తర్వాత తర్వాత పరీక్షా కేంద్రం మార్చుకోవచ్చని యూపీఎస్సీ ప్రకటించింది. యూపీఎస్సీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పరీక్షా కేంద్రం మార్చుకోవచ్చు. అలాగే ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌ పరీక్షల కేంద్రాలూ మార్చుకోవడానికీ అవకాశం. ఈ పరీక్ష కేంద్రం మార్పు ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. ఈ నెల ఏడో తేదీ నుంచి 13న సాయంత్రం ఆరు గంటల వరకు తొలి దశ ఉంటుంది. 20 నుంచి 24 సాయంత్రం ఆరు వరకు రెండో దశ ఉంటుంది. అక్టోబరు 4న యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని