సరిహద్దులో గందరగోళం

తాజా వార్తలు

Updated : 02/07/2020 09:20 IST

సరిహద్దులో గందరగోళం

తనిఖీ కేంద్రం వద్ద భారీగా నిలిచిన వాహనాలు

కోదాడ రూరల్‌ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం సమీపంలోని తెలంగాణ- ఆంధ్రా తనిఖీ కేంద్రం వద్ద గురువారం ఉదయం విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో రద్దీ పెరిగింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు స్వస్థలాలకు పయనమయ్యారు. దీంతో తనిఖీ కేంద్రం సమీపంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అనుమతి పత్రాలు ఉన్నవారిని కొవిడ్‌ నిర్ధారణ కోసం నమూనాలు సేకరించిన తర్వాతే ఏపీలోకి ఆ రాష్ట్ర అధికారులు అనుమతించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రయాణికుల వివరాలు నమోదు చేస్తున్నారు. పాసులు లేనివారిని నిలిపివేశారు. నిన్నటి వరకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో హైదరాబాదుకు నుంచి స్వస్థలాలకు బయల్దేరిన వాహనదారులను సరిహద్దులో నిలిపివేయడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అనుమతి పత్రాలు లేని కార్లను అనుమతించకపోవడంతో కొందరు ద్విచక్ర వాహనాలపై పయనమయ్యారు. మరికొందరు హైదరాబాద్‌ నుంచి కారులో వచ్చి.. కాలినడకన సరిహద్దు దాటిన తర్వాత మరో కారులో వెళ్లడం కనిపించింది.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్‌, పాసులు లేకుండా వస్తున్న వాహనాలను ఏపీ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని