ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం

తాజా వార్తలు

Updated : 02/07/2020 16:27 IST

ఏపీ సచివాలయంలో మరోసారి కరోనా కలకలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మరోసారి కలకలం రేగింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ సచివాలయం ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి. అసెంబ్లీలో ఇద్దరికి, సచివాలయంలో 10 మందికి, జలవనరులశాఖలో ముగ్గురికి, పశు సంవర్థకశాఖలో ఒకరికి కరోనా నిర్దారణ అయింది. దీంతో కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన పలువురు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని అధికారులు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పలువురు ఉద్యోగులు ఇవాళ ఉదయం సచివాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని