తెలంగాణలో కరోనా.. 20వేలు దాటేసిన కేసులు

తాజా వార్తలు

Updated : 03/07/2020 23:18 IST

తెలంగాణలో కరోనా.. 20వేలు దాటేసిన కేసులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 1658 కొత్త కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో కలవరం ఎక్కువవుతోంది. గడిచిన 24గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1892 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఈ రోజు 5965 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 1892 పాజిటివ్‌, 4073 నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులసంఖ్య 20,462కి పెరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1658 కేసులు నమోదుకావడం జనంలో గుబులు రేపుతోంది.  

10వేలకు పైగా కోలుకున్నారు.. 

రాష్ట్రంలో ఓ వైపు కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకొని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతండటం విశేషం. ఈ ఒక్కరోజే 1126మంది కోలుకొని డిశ్చార్జిఅయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 10195కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9984 యాక్టివ్ ‌కేసులు ఉన్నాయి. 

మరో 8మంది మృతి
తెలంగాణలో  కొవిడ్‌ బారిన పడి మరో 8మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 283కి పెరిగింది.  జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని