అసభ్య పదజాలంతో ఆమె దూషించేవారు..

తాజా వార్తలు

Updated : 05/07/2020 16:47 IST

అసభ్య పదజాలంతో ఆమె దూషించేవారు..

సుల్తానా ఆరోపణలపై తుంబే ఆస్పత్రి యాజమాన్యం స్పందన

హైదరాబాద్‌: ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో సుల్తానా చేసిన ఆరోపణలపై తుంబే ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. సుల్తానా ఈ నెల 1న తమ ఆస్పత్రిలో చేరారని పేర్కొంది.  చేరినప్పటి నుంచి ఆమె వైద్య సిబ్బందితో గొడవ పడ్డారనీ.. కొన్నిసార్లు అసభ్య పదజాలంతో దూషించేవారని తెలిపింది. దీంతో ఆమెకు వైద్య సేవలందించేందుకు నర్సింగ్‌ సిబ్బంది నిరాకరించారని వెల్లడించింది. అయినా సుల్తానాకు కొవిడ్‌ చికిత్స కోసం సహకరించామని తెలిపింది. ఆమె ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు యాజమాన్యం తెలిపింది. 

కరోనా చికిత్సకోసం ఛాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరితే ఒక్క రోజుకే రూ.1.15లక్షల బిల్లు వేశారనీ.. ఇదేమిటని ప్రశ్నిస్తే తనను నిర్బంధించారంటూ సుల్తానా ఆరోపించిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి..

ఇంత బిల్లేస్తారా.. ప్రశ్నించిన వైద్యురాలి నిర్బంధం!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని