కొవిడ్‌: ఏపీలో కొత్త కేసులు 1,322

తాజా వార్తలు

Published : 06/07/2020 16:18 IST

కొవిడ్‌: ఏపీలో కొత్త కేసులు 1,322

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,322 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 20,019కి చేరింది. ఇందులో 17,365 మంది రాష్ట్రానికి చెందినవారు. 2,235 మంది ఇతర రాష్ట్రాలవారు, 419 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు. ఈ రోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందినవారు 1,263 మందికాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 56 మంది. ఇక ఇతర దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు ఉన్నారు. 

గత 24 గంటల్లో రాష్ట్రంలో 16,712 శాంపిల్స్‌ పరీక్షించారు. ఇప్పటివరకు 10,33,852 శాంపిల్స్‌ పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,860 యాక్టివ్‌ కేసులున్నాయి. అలాగే ఇప్పటివరకు 8,920 మంది నయమై డిశ్ఛార్జి అయ్యారు. ఇందులో ఈ రోజు డిశ్ఛార్జి అయినవారు 424 మంది. కొవిడ్‌తో ఇప్పటివరకు రాష్ట్రంలో 239 మంది చనిపోయారు. గత 24 గంటల్లో ఏడుగురు కొవిడ్‌తో మృతి చెందారు. 

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి...


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని