‘చలో శ్రీహరికోట’ వాయిదా

తాజా వార్తలు

Published : 09/07/2020 11:05 IST

‘చలో శ్రీహరికోట’ వాయిదా

అమరావతి: ఇస్రో ప్రైవేటీకరణ యోచనను నిరసిస్తూ ఇవాళ సీపీఐ నిర్వహించతలపెట్టిన ‘చలో శ్రీహరికోట’ కార్యక్రమం వాయిదాపడింది. కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నందున దీనిని వాయిదా వేసినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.మరోవైపు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చడంపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని నారాయణ అభినందించారు. ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలో ఎన్ని పడకలున్నాయి? వాటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో విధిగా బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.దీనిపై ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆరోగ్యశ్రీ  పర్యవేక్షణ ఉండాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని