ఆన్‌లైన్‌ ఆర్డర్‌కు మతిపోగొట్టే అడ్రస్‌!

తాజా వార్తలు

Published : 09/07/2020 20:53 IST

ఆన్‌లైన్‌ ఆర్డర్‌కు మతిపోగొట్టే అడ్రస్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు ఇంటి అడ్రస్‌ ఇవ్వడం కామన్‌. ల్యాండ్‌ మార్క్‌ అనే విభాగం దగ్గర ఏ స్కూలో.. థియేటరో.. మందిరం పేరో ఇవ్వడం పరిపాటి. కానీ, ఓ తుంటరి కస్టమర్‌ ఇచ్చిన ఆడ్రస్‌ మాత్రం ఇప్పుడు నెట్టింట్‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఏమిచ్చాడంటే..?

రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఓ కస్టమర్‌ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఓ వస్తువు ఆర్డర్‌ పెట్టాడు. అందులో తన పేరు కింద అడ్రస్‌ రాయాల్సిన చోట ల్యాండ్‌మార్క్‌గా గుడి పేరును ప్రస్తావించాడు. ఫలానా గుడి వద్దకు వచ్చి ఫోన్‌ చేస్తే తాను అక్కడికి వచ్చి వస్తువును తీసుకుంటానని పేర్కొన్నాడు. దీన్ని మాగ్నేష్‌ పండిట్‌రావు అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఎంతైనా ఇండియన్‌ ఈ-కామర్స్ భిన్నమంటూ క్యాప్షన్‌ ఇచ్చారు.

దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. ఇలాంటి అడ్రస్‌లు పెట్టేవారిని తాము ఇంత వరకు చూడలేదంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. తాను కూడా ఇలా ప్రయత్నించి చూస్తానంటూ ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. డెలివరీ బాయ్‌ కాబట్టి సరిపోయింది.. ఒకవేళ డ్రోన్‌ డెలివరీ వస్తే పరిస్థితి ఏంటాబ్బా? అంటూ ఓ నెటిజన్‌ ఫన్నీగా స్పందించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని