నా నెంబర్‌కూ ఫిర్యాదు చేయొచ్చు: ఆళ్ల నాని

తాజా వార్తలు

Published : 11/07/2020 14:28 IST

నా నెంబర్‌కూ ఫిర్యాదు చేయొచ్చు: ఆళ్ల నాని

ఏలూరు: కరోనా ఆస్పత్రుల్లో తక్షణమే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఏపీ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఏలూరు కలెక్టర్‌ ఆఫీసు నుంచి ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో మాధ్యమం ద్వారానే కొవిడ్‌ ఆస్ప్రతుల్లోని రోగులతో మాట్లాడారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో భోజనం నాణ్యత సరిగా లేదని, దుప్పట్లు ఇవ్వట్లేదని, మరుగుదొడ్లు శుభ్రం చేయట్లేదని ఈ సందర్భంగా మంత్రికి రోగులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆళ్ల నాని వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా 1800 233 1077 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తన ఫోన్‌ నెంబర్‌కూ ఫిర్యాదు చేయవచ్చని రోగులకు మంత్రి భరోసా ఇచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని