ఆర్టీసీ ఉద్యోగికి రూ.7 వేతనం 
close

తాజా వార్తలు

Published : 12/07/2020 13:41 IST

ఆర్టీసీ ఉద్యోగికి రూ.7 వేతనం 

చాలా మందికి రూ.5వేల లోపే ఖాతాల్లో జమ

భద్రాచలం: మూడు నెలలుగా సగం వేతనాలు అందుకున్న తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు జూన్‌లో పూర్తి జీతం అందుతుందని ఆశపడ్డారు. ఆ ఆశ ఎంతో సేపు నిలవలేదు. పేస్లిప్‌లు చూసుకొని వారు కంగుతిన్నారు. తమకు రూ.7మాత్రమే వచ్చాయి అని కొందరు చెప్పగా, చాలా మంది రూ.5వేలకు మించి జీతాలు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం చేస్తామని ఎంప్లాయిస్‌ యూనియన్‌ హెచ్చరించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 49వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, సూపర్‌వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. బస్సులు పూర్తిస్థాయిలో నడవకపోవడం వల్ల ఉద్యోగులందరిని విధుల్లోకి తీసుకోవడం లేదు. పని చేసిన రోజులకే వేతనం చెల్లిస్తున్నారు. ఫలితంగా రూ.100 కంటే తక్కువ నుంచి రూ.వెయ్యి లోపు జీతం వచ్చిన ఉద్యోగులు ఉన్నారు. చాలా మందికి రూ.4వేల నుంచి రూ.5వేల జీతం వచ్చింది. భద్రాచలం డిపోలో పని చేస్తున్న ఓ ఉద్యోగి తనకు కేవలం రూ.7 వేతనం మాత్రమే వచ్చిందని పేస్లిప్‌ చూపించారు. ఇదే డిపోలో మరో కార్మికుడు రూ.57 వచ్చిందని వాపోగా, ఇంకొక ఉద్యోగి రూ.77 వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరు తనకు రూ.999 మాత్రమే వేతనం వచ్చిందన్నారు. ఈ జీతాలపై ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులు ఎలా బతుకుతారని ప్రశ్నించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని