భక్తులు లేకుండానే మహంకాళికి తొలి బోనం

తాజా వార్తలు

Published : 12/07/2020 14:14 IST

భక్తులు లేకుండానే మహంకాళికి తొలి బోనం

హైదరాబాద్‌: అంగరంగవైభవంగా నిర్వహించాల్సిన హైదరాబాద్‌ బోనాలు కరోనా కారణంగా ఈ సారి వెలవెలబోతున్నాయి. భక్తులు లేకుండానే ఇవాళ ఉదయం మహంకాళికి తొలి బోనం సమర్పించామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. కరోనా విజృంభణ వల్ల ఈ ఏడాది భక్తులు లేకుండానే ఉజ్జయిని మహంకాళి బోనాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి అని, 
అయితే, సంప్రదాయ పూజలన్నీ సజావుగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. బోనాల ఉత్సవాలను ప్రజలు ఇళ్లల్లోనే జరుపుకుంటున్నారని చెబుతూ.. స్వచ్ఛందంగా సహకరిస్తున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చేవారం నిర్వహించబోయే లాల్‌దర్వాజా ఉత్సవాలు కూడా ఇలాగే జరుగుతాయని తలసాని అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని