కరోనా @ ఏపీ: 1933 కేసులు.. 19 మరణాలు

తాజా వార్తలు

Updated : 12/07/2020 15:08 IST

కరోనా @ ఏపీ: 1933 కేసులు.. 19 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 30 వేలకు చేరువలోకి వచ్చింది. గత 24 గంటల్లో (శనివారం ఉదయం  9 నుంచి  ఆదివారం ఉదయం 9 వరకు) రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1,914 మంది ఉండగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 18 మంది ఉన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చినవారు ఒకరు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య  29,168కి చేరింది. 

ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల్లో ఇతర దేశాలవారు 429 మంది, ఇతర రాష్ట్రాల వారు 2403 మంది ఉన్నారు. రాష్ట్రానికి చెందినవారు 26,336 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,428 మంది కరోనా వైద్యం పొందుతున్నారు. ఈ రోజు డిశ్ఛార్జి అయిన 846 మందితో కలిపి మొత్తంగా 15,412 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 328 మంది చనిపోయారు. అందులో ఈ రోజు మృతి చెందినది 19 మంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 11,53,849 మంది కరోనా పరీక్షలు చేశారు. గత 24 గంటల్లో 17,624 మందికి పరీక్షలు చేశారు. 

జిల్లాల వారీగా ఫలితాలివీ... 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని