ఏపీలో మరో 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు

తాజా వార్తలు

Updated : 13/07/2020 15:21 IST

ఏపీలో మరో 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు

మంత్రి ఆళ్ల నాని వెల్లడి

ఏలూరు: ఏపీలో మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆళ్లనాని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వైద్యకళాశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో సమాజిక ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ. 75 కోట్లతో బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

ఏడు ఐటీడీఏ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని