టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభం

తాజా వార్తలు

Published : 14/07/2020 08:31 IST

టిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభం

గచ్చిబౌలి : కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించాలనే లక్ష్యంతో.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (టిమ్స్‌) ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినవారు చికిత్స నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని మాత్రమే ప్రస్తుతానికి చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. ఈ తరహాలో ఆదివారం ఓ వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించారు. సోమవారం పాజిటివ్‌ వచ్చిన మరికొందరు రోగులూ ఆసుపత్రికి రాగా.. వారిలో పెద్దగా లక్షణాలు లేకపోవడాన్ని గుర్తించి హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించి పంపించేశారు. మరోవైపు ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామకం పూర్తిస్థాయిలో జరగలేదని తెలుస్తోంది. ఒక వైపు నియామక ప్రక్రియను కొనసాగిస్తూనే.. అందుబాటులో ఉన్న వనరులతో వైద్య సేవలను అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో సేవలు ప్రారంభించిన విషయాన్ని ఇంకా అధికారంగా ప్రకటించడం లేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని