చీకట్లో చిదిమేసింది..!

తాజా వార్తలు

Updated : 05/08/2020 08:10 IST

చీకట్లో చిదిమేసింది..!

మోతె : బంధువులను పలకరించి రాత్రివేళ ద్విచక్ర వాహనంపై అత్తవారింటికి పయనమైన ఓ యువకుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. వ్యవసాయ పరికరాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొని, ఇనుప నాగలి గొంతుకు బలంగా గుచ్చుకుపోవటంతో అక్కడికక్కడే కన్నుమూశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణం వెంకటగిరి ప్రాంతానికి చెందిన బండ్ల సంతోష్‌(27) అదే జిల్లాలోని తిర్మలాయపాలెం మండలం కాకరవాయిలో బంధువుల ఇంటి నుంచి తన అత్తగారు ఊరైన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌)కు వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు. ట్రాక్టర్‌ ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బోట్యాతండా నుంచి తిర్మలాయపాలెం మండలం సోలిపురంలో పొలం దున్నేందుకు వెళ్తోంది. ట్రాక్టర్‌ ఇంజిన్‌కు మించి వెనకవైపు పొడవైన ఇనుప నాగలి అడ్డంగా ఉంచారు. ఇది చీకట్లో కనిపించక ఎదురుగా బైకుపై వస్తున్న సంతోష్‌ గొంతుభాగంలో లోతుగా గుచ్చుకుంది. కొంతదూరం అలాగే ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేస్తామని ఎస్సై కె.గోవర్ధన్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని