పుణె నుంచి గంటలో హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల తరలింపు

తాజా వార్తలు

Published : 17/08/2020 07:38 IST

పుణె నుంచి గంటలో హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల తరలింపు

 విజయవంతంగా శస్త్రచికిత్స

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా ప్రభావంతో సాధారణ వైద్యానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ 560 కి.మీ. దూరం నుంచి గంటలో ఊపిరితిత్తులు తరలించి.. ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టిన ఉదంతమిది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ సికింద్రాబాద్‌ కిమ్స్‌ హార్ట్‌ అండ్‌ లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు. అవయవ మార్పిడి కోసం జీవన్‌దాన్‌ ఫౌండేషన్‌లో పేరు నమోదు చేసుకున్నారు. పుణెలో ఓ వ్యక్తి జీవన్మృతుడు(బ్రెయిన్‌డెడ్‌) కావడంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకొచ్చారు. పరీక్షలో ఆయనకు కరోనా నెగెటివ్‌ రావడంతో తెలంగాణ జీవన్‌దాన్‌ ఫౌండేషన్‌ ఇన్‌ఛార్జి డాక్టర్‌ స్వర్ణలత నేతృత్వంలో ఊపిరితిత్తులు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. వాటిని భద్రపరచిన పెట్టెను ఆదివారం ప్రత్యేక విమానంలో బేగంపేటకు తరలించారు. అక్కడి నుంచి కిమ్స్‌కు ఊపిరితిత్తులు చేరాయి. వెంటనే వైద్యనిపుణులు వాటిని రోగికి అమర్చి ఊపిరిపోశారు. ఒక ప్రాణం నిలిపేందుకు 560 కి.మీ. దూరం నుంచి గంట వ్యవధిలో ఊపిరితిత్తులు చేరవేసినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. రెండు నగరాల ట్రాఫిక్‌ పోలీసులు, భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ అధికారులు సహకారం అందించారని పేర్కొన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని