బాలుడి చేతివేళ్లపై నుంచి 50 కార్లు!

తాజా వార్తలు

Updated : 28/09/2020 09:45 IST

బాలుడి చేతివేళ్లపై నుంచి 50 కార్లు!

చెన్నై, న్యూస్‌టుడే: ప్రపంచ రికార్డు లక్ష్యంగా తంజావూర్‌ జిల్లాకు చెందిన పదేళ్ల బాలుడు తన రెండు చేతుల వేళ్లపై నుంచి 50 కార్లను పోనిచ్చి సాహస విన్యాసం చేశాడు. పట్టుకోట్టై సమీపాన ఉంపళాకొల్లై గ్రామానికి చెందిన రవిచంద్రన్‌, వేంబు దంపతుల కుమారుడు నారాయణమూర్తి (10). స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. కరాటేలో శిక్షణ కూడా పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ అవగాహన, ప్రపంచ రికార్డు లక్ష్యంతో ఆదివారం సాహస విన్యాసాన్ని ప్రదర్శించాడు. పట్టుకోట్టై-ముత్తుపేట్టై మెయిన్‌ రోడ్డులోని దువరకురిచ్చి పెట్రోల్‌ బంకు సమీప ప్రాంతం వేదిక అయింది. రెండు చేతుల వేళ్లపై నుంచి 50 కార్లను పోనిచ్చాడు. అంతకుముందు పట్టుకోట్టై డీఎస్పీ పుగళేంది గణేశ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలుణ్ని పలువురు అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని