close

తాజా వార్తలు

Updated : 16/04/2021 07:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.కోటిన్నర వార్షిక వేతనంతో అమెజాన్‌కు..

వివేక్‌ గిర్రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: అమెరికాలోని జార్జియా టెక్‌ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన యువకుడు గిర్రెడ్డి వివేక్‌ అమెరికాలోని అమెజాన్‌ కంపెనీలో గతేడాది జరిగిన ప్రాంగణ నియామకాల్లో రూ.1.50 కోట్ల వార్షిక వేతనంతో సీనియర్‌ ఫైనాన్షియల్‌ ఎనలిస్టుగా ఎంపికయ్యారు. ఈ ఏడాది జూన్‌ 21న సియాటెల్‌లోని ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో చేరనున్నారు. ఆయన తల్లిదండ్రులు భానురెడ్డి, జీఎస్‌ రెడ్డి నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో ఉంటున్నారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. జీఎస్‌ రెడ్డి సెబీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, మెక్‌గిల్‌ యూనివర్సిటీలో వివేక్‌ బీఏ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ చదివారు. ఆ తర్వాత బెంగళూరులో మూడేళ్లు ఉద్యోగం చేశారు. ఎంబీఏ చేయాలన్న ఉద్దేశంతో జీమాట్‌ రాసి 94 పర్సంటైల్‌ సాధించారు. అంతకుముందు శాట్‌లో గణితం విభాగంలో 800కు 800 సాధించారు. పూర్తి ఉపకారవేతనం ద్వారా జార్జియా టెక్‌ విశ్వవిద్యాలయంలో రెండేళ్ల ఎంబీఏ(ఫైనాన్స్‌) కోర్సులో చేరారు. తొలి ఏడాది పూర్తయ్యాక అమెజాన్‌ కంపెనీలో 12 వారాల ఇంటర్న్‌షిప్‌ చేశారు. ఎంబీఏ చదివే ప్రతిభావంతులైన విద్యార్థుల వివరాలు ప్రచురించే అమెరికాలోని ప్రముఖ మేగజైన్‌ ‘పొయట్స్‌ అండ్‌ క్వాంట్స్‌’లో గత ఏడాది వివేక్‌ వివరాలు ప్రచురితమయ్యాయి.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని