close

తాజా వార్తలు

Updated : 05/05/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తేలికగా తీసుకోవద్దు..ఏమరపాటు అసలే వద్దు.!

ఈనాడు, హైదరాబాద్‌

కమల్‌ కామరాజు, సినీనటుడు

‘‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఏం చేయదనే నిర్లక్ష్యం వద్ధు సోకితే ఏదో జరుగుతుందనే ఆందోళనకు గురికావద్దంటున్నా’’రు సినీనటుడు కమల్‌కామరాజు. కొన్నిసార్లు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. వైరస్‌ బారిన పడాల్సి రావచ్ఛు ఎంత ఆరోగ్యకర జీవితం గడిపితే అంత త్వరగా దీన్నుంచి బయటపడవచ్చని స్వీయ అనుభవం నేర్పిందంటారు ఆయన. వైద్యుల సలహాలతో హోం క్వారంటైన్‌ ద్వారా కొవిడ్‌ను ఎలా జయించారో ‘ఈనాడు’తో పంచుకున్నారు.

పోషకాహారం.. ఆవిరి.. ధ్యానం..

ఏప్రిల్‌ 9న కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇంట్లో అందరికీ వైద్య పరీక్షలు చేయించడంతో ఇంట్లోని ఆరుగురు కరోనాకు గురైనట్లు తెలిసింది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సలహాతో చికిత్స ప్రారంభించాం. వైరస్‌కు గురైన పెద్దవాళ్లలో ఒకరికి మధుమేహం ఉండటంతో కాస్త భయమేసింది. పోషకాహారం, వేడినీటితో ఆవిరి పట్టడం, ధ్యానం చేయటం.. ఇవన్నీ బాగా పనిచేశాయి. నిత్యం ఆక్సిమీటర్‌తో పల్స్‌, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు పరిశీలిస్తూ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకునేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్లకు వైరస్‌ సోకటం చూసి భయమేసింది. వాళ్లతో మాట్లాడలేదు. దగ్గరగా ఉండలేదు. అయినా వారికి కొవిడ్‌ సోకిందంటే ఎంత వేగంగా మహమ్మారి విస్తరిస్తుందనేది అర్థం చేసుకోవచ్ఛు

ప్రతి ఇంట్లో పల్స్‌ ఆక్సిమీటర్‌ ఉండాలి...

ప్రతి ఇంట్లో ఆక్సిమీటర్‌ ఉండాల్సిన సమయమిది. అవసరమైతే ప్రభుత్వమే వాటిని రాయితీపై అందిస్తే బావుంటుంది. అకస్మాత్తుగా తగ్గే ఆక్సిజన్‌ స్థాయిలను ముందుగానే గుర్తిస్తే చాలా ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని వైద్యులు కూడా చెబుతున్నారు. పండ్లు, గుడ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. నిమ్మకాయ, బత్తాయి, బొప్పాయి తీసుకోవాలి. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. 50 ఏళ్లు దాటిన వారున్న కుటుంబాల్లో యువత నిర్లక్ష్యండా ఉండవద్దనేది నా సూచన.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని