close

తాజా వార్తలు

Updated : 05/05/2021 08:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సైకిల్‌పై వస్తారు.. మందులిస్తారు

కరోనా కాలంలో వృద్ధులకు అండగా ‘రిలీఫ్‌ రైడర్స్‌

’సైకిల్‌పై మందులు చేరవేస్తున్న శాంతన సెల్వన్‌

కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వయోవృద్ధులకు ఔషధాలను ఇంటికే చేరవేస్తూ వారిని ఆదుకుంటున్నారు ‘రిలీఫ్‌ రైడర్స్‌’ స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఇందుకోసం సైకిళ్లను మాత్రమే ఉపయోగించడం వీరి ప్రత్యేకత.
ఫోన్‌ చేస్తే ఇంటికే ఔషధాలు..
నగరంలోని ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తున్న శాంతన సెల్వన్‌ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైక్లింగ్‌ గురించి ప్రచారం చేస్తున్నారు. అవసరమైన వృద్ధులు, దివ్యాంగులకు మందులను ఉచితంగా వారి ఇంటికి చేరవేసేందుకు ఇటీవల ‘రిలీఫ్‌ రైడర్స్‌’ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఆయనకు నగరంలోని సైక్లింగ్‌ బృందాలకు చెందిన 90 మందికి పైగా సభ్యులు సహకారం అందిస్తున్నారు. అవసరమైనవారు ఫోన్‌ చేస్తే ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఇంటికే చేరవేస్తున్నారు.
ఇలా పొందాలి..
మందులను ఇంటికి తెప్పించుకోవడానికి.. ఉదయం 6 నుంచి 10 గంటలు, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య 95661 70334, 96295 57866 నంబర్లకు కాల్‌ చేయాల్సి ఉంటుంది. అవసరమైన మందులకు సంబంధించి వైద్యులు రాసిన మందుల చీటీని ఈ నంబర్లకు వాట్సాప్‌ ద్వారా పంపాలి. మందులు అందజేయాల్సిన ఇంటి చిరునామా, నిర్దిష్టమైన లొకేషన్‌ వివరాలను కూడా పంపాలి. వీటిని నమోదు చేసుకున్న రిలీఫ్‌ రైడర్స్‌ సభ్యులు.. సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లి, వారితో మాట్లాడించి ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించే ఏర్పాటు చేస్తారు. ఇచ్చిన చిరునామాకు వెంటనే సైకిల్‌పై వచ్చి మందులు అందజేస్తారు.  

రోజుకు 60 వరకు ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి..

కరోనా సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులు, దివ్యాంగులకు సహాయం చేయడానికే రిలీఫ్‌ రైడర్స్‌ సంస్థను ప్రారంభించాను. రోజుకు 60 వరకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఈ సేవా కార్యక్రమంలో భాగం అవుతామంటూ చాలా మంది ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై బాధ్యతతో మేమంతా సైకిళ్లనే ఉపయోగిస్తున్నాం.


- శాంతన సెల్వన్‌, రిలీఫ్‌ రైడర్స్‌ వ్యవస్థాపకులు

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని