రోడ్లపై ధాన్యం కుప్పలు ఉంచొద్దు
close

తాజా వార్తలు

Updated : 16/05/2021 20:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్లపై ధాన్యం కుప్పలు ఉంచొద్దు

బీర్కూర్‌: రోడ్లకు ఇరువైపులా ధాన్యం కుప్పలు నిల్వచేసి వాటిపై బండరాళ్లు పెట్టొద్దని ఎస్సై రాజేశ్‌ రైతులకు సూచించారు. ఆదివారం మండలంలోని దామరంచ, రైతునగర్‌, అన్నారం, చించొల్లి, కిష్టాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రధాన రహదారుల్లో ధాన్యం కుప్పలపై పెట్టిన బండరాళ్లను తొలగించారు. అనంతరం రైతులతో సమావేశమై పలు సూచనలు ఇచ్చారు. రోడ్లకు ఇరువైపులా ధాన్యం కుప్పలు, వాటిపై రాళ్లు పెట్టొద్దని రైతులను కోరారు. ఇటీవల వాహనదారులు ధాన్యం కుప్పలపై పెట్టిన బండరాళ్లను ఢీకొని పలువురు మృతి చెందారని గుర్తు చేశారు. వాహనదారులకు రైతులు సహకరించాలని కోరారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ కాశీరాం, సొసైటీ ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ సాయన్న ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని