AP news: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Updated : 25/05/2021 16:23 IST

AP news: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖ:  విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలతో మంటలు ఎగసిపడుతున్నాయి. భారీశబ్దం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.అత్యంత ప్రమాద సమయాల్లో మోగించిన మూడు సైరన్లు మోగించి ఉద్యోగులను బయటకు పంపివేశారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

హెచ్‌పీసీఎల్‌ పాత టెర్మినల్‌ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ విభాగంలో ప్రమాదం జరిగింది, కారణాలు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. తాజా ప్రమాదంతో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంధనం నిల్వ చేసే పెద్ద ట్యాంక్‌ పేలి ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముడి చమురు ప్రాసెస్‌ సమయంలో పేరుకుపోయిన కర్బన పదార్థాలు అప్పుడప్పుడూ పేలడం ఇక్కడ సర్వసాధారణం అయితే, తాజా ప్రమాదంలో మరీ ఎక్కువగా మంటలు ఎగసిపడుతుండటంతో భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మూడు యూనిట్లు ఉన్నాయి. తాజా ప్రమాదం సీడీయూ మూడో యూనిట్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్‌, అతి ఎక్కుగా మండే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉంటారు. అత్యాధునిక పరికరాలతో ప్రస్తుతం మంటలు అదుపు చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి కొన్ని అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చారు. ఇక్కడ నీటితో మంటలను అదుపు చేసే వీలుండదు.. కేవలం కొన్ని రసాయనాలతో మాత్రమే మంటలను అదుపు చేయాలి.

వైద్య సేవలను అందించేందుకు కొన్ని అంబులెన్స్‌లను కూడా అక్కడ సిద్ధం చేశారు. ప్రమాద సమయంలో యూనిట్‌లో ఆరుగురు సిబ్బందితో పాటు  మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ముడి చమురును ఈ యూనిట్‌లోనే ప్రాసెస్‌ చేస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. యూనిట్‌ మొత్తం మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మొత్తం 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు.


 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని