AP News: ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు
close

తాజా వార్తలు

Updated : 07/06/2021 14:04 IST

AP News: ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు

అమ‌రావ‌తి: ఏపీలో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతున్న నేపథ్యంలో ప‌గ‌టి కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. క‌ర్ఫ్యూను ఈ నెల 20 వ‌ర‌కు పొడిగించిన ప్ర‌భుత్వం.. స‌డ‌లింపు స‌మ‌యాన్ని కూడా పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద‌యం ఆరు నుంచి మధ్యాహ్నం 12 వ‌ర‌కు ఉన్న స‌డ‌లింపు స‌మయం.. ఈ నెల 11 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పటికే విధించిన కర్ఫ్యూ గడువు 10వ‌ తేదీతో ముగియ‌నున్న నేప‌థ్యంలో సీఎం వివిధ శాఖల అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో దీనిపై నిర్ణ‌యం తీసుకున్నారు. 

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త నెల‌ 5న ప‌గ‌టి కర్ఫ్యూని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వ‌ర‌కూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత కూడా క‌రోనా కేసుల్లో త‌గ్గుద‌ల న‌మోదు కాక‌పోవ‌డంతో మే నెలాఖ‌రుకు వ‌ర‌కూ పొడిగించిన విషయం తెలిసిందే. గ‌డువు ముగియ‌డంతో స‌మీక్ష నిర్ణ‌యించిన సీఎం జూన్ 10 వ‌ర‌కూ క‌ర్ఫ్యూను పొడిగించారు. ఆ గ‌డువు కూడా ముగుస్తుండ‌టంతో ఇవాళ జ‌గ‌న్ మ‌ళ్లీ స‌మీక్ష నిర్వ‌హించి 20వ తేదీ వ‌ర‌కూ క‌ర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. 10వ తేదీ వ‌ర‌కు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 11 తేదీ నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతించ‌నున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని