Gandhiji: ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మహాత్ముడి ప్రతిమ
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 12:23 IST

Gandhiji: ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మహాత్ముడి ప్రతిమ

ఉత్తర్‌ప్రదేశ్‌: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లా భేడిహా గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు సూరజ్‌ వినూత్న ప్రయత్నం చేశాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో గాంధీ బొమ్మ రూపొందించాడు. వ్యర్థాల నుంచి సేకరించిన ప్లాస్టిక్‌కు సిమెంట్, ఇనుము, గోనె సంచుల్ని జోడించి తయారు చేశాడు. అంతేకాదు.. తన ఆదాయంలోంచి తరచూ గ్రామ పంచాయతీకి విరాళం ఇస్తుంటాడు. ఇలా ఇప్పటివరకు రూ.17 వేలు అందించాడు. గ్రామంలో చాలా ప్రాంతాల్లో పూలమొక్కలు కూడా పెంచుతున్నాడు. ఇటీవల అతడికి గ్రామ సర్పంచి రూ.5,100 ప్రోత్సాహకంగా ఇవ్వగా.. అందులో నుంచి రూ.4,100లను తిరిగి గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చాడని గ్రామస్థులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని