Vaccine: వారు మూడో డోసు తీసుకుంటే మేలు
close

తాజా వార్తలు

Published : 16/06/2021 13:28 IST

Vaccine: వారు మూడో డోసు తీసుకుంటే మేలు

 ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి

హైదరాబాద్‌ : రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వాడుతున్నవారు, మధుమేహం నియంత్రణలో లేనివారు రెండు డోసులు పొందిన 8 వారాల తర్వాత మూడో డోసు టీకాను కూడా తీసుకుంటే మేలని  ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం ‘కొవిడ్‌ నుంచి నేర్చుకున్న పాఠాలు.. భవిష్యత్‌ వ్యూహాలు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు.
 కొవిడ్‌ను ప్రధానంగా రెండుదశలుగా విభజించాలి. తొలివారంలో వైరీమియా.. అంటే ఈ రోజుల్లో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో లక్షణాలు కనిపిస్తున్నప్పుడు రెమ్‌డెసివిర్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీల తరహా చికిత్సలను అందించాలి.
 రెండోవారంలో సైటోకైన్స్‌ ఉప్పెన. ఇది ప్రమాదకరమైన దశ. ఈరోజుల్లో యాంటీ వైరల్‌ ఔషధాలు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. రక్తనాళాలల్లో ఉన్నట్టుండి రక్తం గడ్డకట్టే అవకాశాలు పెరుగుతాయి. దీన్ని నివారించడానికి స్టిరాయిడ్స్‌, టోసిలిజుమాబ్‌, బారిసిటినిబ్‌ వంటి ఔషధాల వినియోగం అవసరం. అయితే స్టిరాయిడ్‌లను మితిమీరి వాడడం వల్ల వృద్ధుల్లో, రక్తంలో చక్కెర నియంత్రణ లేని మధుమేహుల్లో, అధిక రక్తపోటు బాధితుల్లో దీర్ఘకాల కొవిడ్‌ సమస్యలు ఎదురవుతున్నాయి.
  ప్రధానంగా వైరస్‌ బాధితులను ఎటువంటి లక్షణాలు లేనివారు, స్వల్ప, మధ్యస్థ, తీవ్ర, విషమ లక్షణాలున్నవారుగా విభజించాలి. మధ్యస్థ లక్షణాలున్న రోగుల్లో తొలి 7 రోజుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఉపయోగం. ఈ దశలో రెమ్‌డెసివిర్‌ను ఇవ్వడం వల్ల తీవ్రదశకు చేరుకోకుండా అడ్డుకుంటుంది.
 ఇప్పటివరకూ మా ఆసుపత్రిలో మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ చికిత్సను 50 మంది రోగులకు అందించాం. అందరికీ వారం రోజుల్లో నెగెటివ్‌ వచ్చింది. రెండోదశ కొవిడ్‌లో వైరస్‌ వ్యాప్తికి సుమారు 60 శాతం డెల్టా రకం వైరస్సే కారణమని గుర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని