TS News: ఆ వాహనాలను వదిలిపెట్టనున్న పోలీసులు
close

తాజా వార్తలు

Published : 22/06/2021 15:52 IST

TS News: ఆ వాహనాలను వదిలిపెట్టనున్న పోలీసులు

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు వదిలిపెట్టనున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జప్తు చేసిన వాహనాలను పూచికత్తు తీసుకొని విడుదల చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్లతో పాటు, జిల్లా ఎస్పీలకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను పోలీసులు జప్తు చేసిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో వాహనాలను పట్టుకుని ఆయా పోలీసు స్టేషన్లలో ఉంచారు. వాహనదారులు పూచికత్తు సమర్పించి వాహనాలను తీసుకెళ్లొచ్చని పోలీసులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని