MMTS: పట్టాలెక్కిన ఎంఎంటీఎస్‌ రైళ్లు
close

తాజా వార్తలు

Updated : 23/06/2021 10:13 IST

MMTS: పట్టాలెక్కిన ఎంఎంటీఎస్‌ రైళ్లు

హైదరాబాద్‌: నగరంలో మళ్లీ ఎంఎంటీఎస్‌ కూత ప్రారంభమైంది. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చే రైళ్లు నేటి నుంచి పట్టాలెక్కాయి. 15 నెలల తర్వాత బుధవారం నుంచి పాక్షికంగా రైళ్లు తిరుగుతున్నాయి. కొవిడ్‌కు పూర్వం 121 సర్వీసులు తిరగ్గా.. ప్రస్తుతానికి 10 సర్వీసులే అందుబాటులోకి వస్తున్నాయి. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఇరువైపులా మూడు చొప్పున మొత్తం 6, హైదరాబాద్‌- లింగంపల్లి మధ్య కూడా ఇరువైపులా రెండేసి చొప్పున మొత్తం 4 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తాయి. ఉదయం 7.50 నుంచి రాత్రి 7.05 గంటల వరకు రైళ్లు తిరగనున్నాయి. గత ఏడాది మార్చిలో కరోనాతో రైళ్లు ఆగిపోవడంతో సీజన్‌ టిక్కెట్‌ తీసుకున్న వారు పూర్తి రోజులు వినియోగించుకోలేకపోయారు. అలాంటి వారు జూన్‌ 23 నుంచి మిగిలిన రోజులు ఎన్ని ఉంటే అంతవరకు పాత సీజన్‌ టిక్కెట్లు వినియోగించుకోవచ్చునని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌.రాకేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. స్టేషన్లలోని టిక్కెట్‌ కేంద్రాల్లో గడువు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

యూటీఎస్‌ యాప్‌తోనూ..

కరోనా నేపథ్యంలో స్టేషన్లలో నగదుతోపాటు స్మార్ట్‌ కార్డులున్నవారు ఏటీవీఎం(ఆటోమెటిక్‌ టిక్కెట్‌ వెండింగ్‌ మెషిన్లు)ల ద్వారా టిక్కెట్లు తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇలా 3 శాతం రాయితీ కూడా పొందవచ్ఛు యూటీఎస్‌ (అన్‌ రిజర్వుడు టిక్కెటింగ్‌ సిస్టం) యాప్‌ ద్వారా పేపర్‌లెస్‌ టిక్కెట్‌ను పొందవచ్ఛు ఇలా 5 శాతం రాయితీ పొందవచ్చని ద.మ. రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య సూచించారు.

సర్వీసులు సమయాలు

* ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి: ఉదయం 7.50, 10.55, సాయంత్రం 4.20 గంటలకు

* లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా: ఉ.9.20, మ.12.40, సా.6.05

* హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి: ఉ.9.36, సా.6.15

* లింగంపల్లి నుంచి హైదరాబాద్‌: ఉ.8.43, సా.5.15

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని