నా భూమినే మార్చేస్తారా?: పరిటాల సునీత

తాజా వార్తలు

Updated : 30/06/2021 08:45 IST

నా భూమినే మార్చేస్తారా?: పరిటాల సునీత

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: అధికార ఒత్తిళ్లకు తలొగ్గి రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహిరిస్తున్నారని, అలాంటివారు పనితీరు మార్చుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు భూదస్త్రాలు, ఆన్‌లైన్‌లో వివరాలు తారుమారు చేస్తున్నారని విమర్శించారు. కనగానపల్లి మండలంలో తన పేరున ఉన్న పట్టాభూమిని వేరొకరి పేరున మార్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా పనిచేసిన తన భూమినే మార్చారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటో ఊహించవచ్చన్నారు. రెవెన్యూ అధికారులు, రైతులకు అన్యాయం చేయొద్దని, వివరాలన్నీ సక్రమంగా ఉండి సాగులో ఉన్నవారికి న్యాయం చేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని