Sonu Sood: సోనూసూద్‌ను హీరో కొడుతున్నారని..

తాజా వార్తలు

Updated : 14/07/2021 13:06 IST

Sonu Sood: సోనూసూద్‌ను హీరో కొడుతున్నారని..


దెబ్బతిన్న టీవీ

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: కరోనా సమయంలో సేవాకార్యక్రమాలు చేస్తూ రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సినీ నటుడు సోనూసూద్‌ను సినిమాలో హీరో కొడుతుండటంతో తట్టుకోలేక ఏడేళ్ల్ల బాలుడు టీవీని పగలగొట్టాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారానికి చెందిన చడపంగు గురవయ్య, పుష్పలత తమ కుమారుడు విరాట్‌తో కలిసి శుభకార్యానికి హాజరయ్యేందుకు అక్కడకు వెళ్లారు. కుటుంబ సభ్యులందరు కలిసి టీవీలో సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్‌గా సోనూసూద్‌ కనిపించారు. విలన్‌ పాత్రలో ఉన్న సోనూసూద్‌ను హీరో కొట్టడంతో కోపానికి గురైన విరాట్‌ అందుబాటులో ఉన్న రాయి విసరడంతో టీవీ పగిలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు నివ్వరపోయారు. టీవీ ఎందుకు పగులగొట్టావని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సోనూసూద్‌ను కొట్టినందుకు కోపమొచ్చిందని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే.. ఈ విషయాన్ని సోనూసూద్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడం కొసమెరుపు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


విరాట్‌



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని