Ramappa Temple: రామప్పకు త్వరలో యునెస్కో గుర్తింపు: శ్రీనివాస్‌గౌడ్‌
close

తాజా వార్తలు

Published : 22/07/2021 16:47 IST

Ramappa Temple: రామప్పకు త్వరలో యునెస్కో గుర్తింపు: శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, జలపాతాలు క్రీస్తుపూర్వం నుంచి తెలంగాణలో ఉన్నాయని, అయినా.. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కటి కూడా లేదని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆదిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు ప్రక్రియ చివరిదశకు చేరిందని వెల్లడించారు. ఆ ప్రాంత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని యునెస్కో కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసిందని తెలిపారు.

యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదిశగా 3 కీలక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. ఈనెల 25న జరిగే సమావేశంలో ప్రపంచ వారసత్వ కమిటీ సభ్యుల సమ్మతి పొందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రామప్ప దేవాలయానికి సమీపంలోని రెండు ఆలయాలను రామప్ప దేవాలయ ఆస్తి పరిధిలోకి తెచ్చేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆ ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక అభివృద్ధి అథారిటీ, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటుచేశామన్నారు. త్వరలోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. ఇదే కోవలో మరిన్ని పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను, దేవాయాలను అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని