Love: చితిపై ఒక్కటైన ప్రేమజంట!

తాజా వార్తలు

Updated : 03/08/2021 07:25 IST

Love: చితిపై ఒక్కటైన ప్రేమజంట!

ప్రేమలో కలకాలం బతకలేని ఓ జంట.. చనిపోయాక జరిగిన వివాహంతో ఒక్కటైంది. తమ ప్రేమను కుటుంబసభ్యులు, సమాజం అంగీకరించదేమోనన్న భయంతో ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే.. అంత్యక్రియల సమయంలో వారిద్దరికీ ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి జరిపించారు. మహారాష్ట్ర జలగావ్‌ జిల్లాలో జరిగిందీ ఘటన. వాడే గ్రామానికి చెందిన ముకేశ్‌ కైలాస్‌ సోనావోనా(22), పాలట్‌ గ్రామానికి చెందిన నేహా బాపు(19) ప్రేమించుకున్నారు. శనివారం రాత్రి వాడే గ్రామంలోని ఓ పాఠశాలలో ముకేశ్‌, నేహా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగుచూసింది. పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వర్తించే ముందు ఆ జంట మృతదేహాలకు పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. దాంతో చితిపైనే పెళ్లి తంతు జరిపించి, దహనం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని