AP News: నదిలో చిక్కుకుని బయటపడి.. మృత్యుంజయురాలు

తాజా వార్తలు

Published : 13/08/2021 12:56 IST

AP News: నదిలో చిక్కుకుని బయటపడి.. మృత్యుంజయురాలు

పెన్నా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఎలాగోలా చిన్న గట్టుమీదకు చేరిన వృద్ధురాలు... 48 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన ఉదంతమిది... కడప జిల్లా కమలాపురం మండలం గంగవరానికి చెందిన రుక్మిణమ్మకు 60 ఏళ్లు. మంగళవారం ఏటూరు గ్రామం వెళ్తూ మంచినీరు తాగేందుకు సమీపంలోని పెన్నానదిలోకి దిగారు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయారు. ప్రవాహంలో కొట్టుకుపోతూ... వల్లూరు మండల పరిధి చెరువుకిందపల్లె సమీపంలోని మామిడివనం దగ్గర ఇసుక గట్టుపైకి చేరుకున్నారు. కాపాడాలంటూ ఎంతగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. 48 గంటల పాటు అక్కడే ఉండి ఆకలైనప్పుడు నీటిని తాగుతూ గడిపారు. గురువారం ఉదయం అటుగా వచ్చిన పశువుల కాపరులకు ఆమె ఆర్తనాదాలు వినిపించాయి. వారు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఎస్‌ఐ కల్పన సంఘటన స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్లను రప్పించి రుక్మిణమ్మను రబ్బరు ట్యూబ్‌ సాయంతో బయటకు తీసుకొచ్చారు. నీరసించిన రుక్మిణమ్మకు వల్లూరు పీహెచ్‌సీలో చికిత్స చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు.

- న్యూస్‌టుడే, వల్లూరు 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని