Paytm: పేటీఎంకు రూ.25 వేల జరిమానా

తాజా వార్తలు

Published : 17/10/2021 10:15 IST

Paytm: పేటీఎంకు రూ.25 వేల జరిమానా

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: పేటీఎంకు జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 రూ.25 వేల జరిమానా విధించింది. జూబ్లీహిల్స్‌కు చెందిన వివేక్‌దీక్షిత్‌ క్వికర్‌లో ఓ వస్తువు కొనడానికి పేటీఎం ద్వారా రూ.6,865 నగదు బదిలీ చేశారు. వస్తువు నచ్చకపోవడంతో డబ్బు తిరిగి చెల్లించాలని అభ్యర్థించగా సంస్థ నుంచి వచ్చిన డబ్బు అతని బ్యాంకు ఖాతాలోకి బదిలీ కాలేదు. క్వికర్‌తోపాటు పేటీఎం, బ్యాంకు అధికారులను పలు దఫాలుగా సంప్రదించగా పేటీఎం బగ్‌ ఖాతాలోకి డబ్బులు మళ్లించినట్లు తెలుసుకున్న వివేక్‌... ప్రతివాద సంస్థ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. దీంఓత జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో వివేక్‌ వాదనతో ఏకీభవించి ఆయనకు రూ.6,865 తిరిగి చెల్లించడంతోపాటు రూ.25 వేల జరిమానా, కేసు ఖర్చుల కింద రూ.1,000 ఇవ్వాలని ఆదేశించింది 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని