IIT: ఐఐటీ అయినా నచ్చిన బ్రాంచీ వస్తేనే.. లేదంటే!

తాజా వార్తలు

Updated : 25/10/2021 19:21 IST

IIT: ఐఐటీ అయినా నచ్చిన బ్రాంచీ వస్తేనే.. లేదంటే!

 వెయ్యిలోపు ర్యాంకర్లలో చేరింది 777 మందే

హైదరాబాద్‌ ఐఐటీలో 34 మంది..

2020 ప్రవేశాల తీరుపై ఐఐటీ దిల్లీ నివేదిక 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది పోటీ పడితే.. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్లు దక్కేది 16 వేల మందికే. అయినా కొందరు వాటిని కాదని ఇతర సంస్థల్లో చేరుతున్నారు. ఆశించిన ఐఐటీలో.. అదీ కోరుకున్న బ్రాంచీ దక్కితేనే ప్రవేశాలు పొందుతున్నారు. కొందరికి కొత్త ఐఐటీలో సీటు దక్కినా.. దానికి బదులు సొంత రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాల్లోని పాత ఎన్‌ఐటీల వైపు మొగ్గు చూపారు. నిరుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహించిన ఐఐటీ దిల్లీ.. ప్రవేశాల తీరుపై తాజాగా నివేదికను విడుదల చేసింది. గత ఏడాది పరీక్షకు మొత్తం 1,50,838 మంది హాజరయ్యారు. వారిలో 43,204 మంది జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత పొందారు. వెయ్యిలోపు ర్యాంకు సాధించిన వారిలో 777 మందే 11 ఐఐటీల్లో చేరారు. ఐఐటీ హైదరాబాద్‌లో 34 మంది ప్రవేశాలు పొందారు. 223 మంది ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో, కొందరు విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో చేరారని ఐఐటీ దిల్లీ సంచాలకుడు ఆచార్య రాంగోపాల్‌రావు తెలిపారు. 23 ఐఐటీల్లో మొత్తం 16,061 మంది సీట్లు పొందారు. వీటిలో 3,197 (19.90 శాతం) సీట్లు అమ్మాయిలకు దక్కాయి. మొదటి, నాలుగో ర్యాంకర్లు అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో చేరారు.

- ఈనాడు, హైదరాబాద్‌ 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని