భద్రాచలం వద్ద పెరిగిన వరద ఉద్ధృతి
close

తాజా వార్తలు

Published : 12/08/2020 13:59 IST

భద్రాచలం వద్ద పెరిగిన వరద ఉద్ధృతి

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతోపాటు ఇంద్రావతి వైపు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

 మంగళవారం రాత్రి 25 అడుగులు ఉండగా.. అర అడుగు వరకు తగ్గింది. మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత పుంజుకుని బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు 29.5 అడుగులకు చేరుకుంది. జలాశయాలు నిండిపోవడంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం భారీగా ఉండటంతో వరద ఉద్ధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని జలవనరులశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని