భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి
close

తాజా వార్తలు

Updated : 16/08/2020 17:11 IST

భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి

హైదరాబాద్‌: గోదావరి వరద ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర జలసంఘం హెచ్చరికలు జారీ చేసింది. భద్రాచలం వద్ద ఈరోజు రాత్రి 9గంటలకు ప్రమాదస్థాయి దాట వచ్చని తెలిపింది. ఈనేపథ్యంలో సహాయక చర్యల కోసం రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం 0404 234 50624 నంబర్‌కు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పాటు, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల  నదిలో ప్రవాహం భారీగా ఉంది. గతంలో అత్యధికంగా వరద 56.6 అడుగుల మేర ప్రవహించిందని జలసంఘం తెలిపింది. అదికూడా సరిగ్గా (1986 ఆగస్టు 16వ తేదీ) ఇదే రోజున ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహించిందని జలసంఘం వెల్లడించింది. ఈరోజు రాత్రి 9గంటల ప్రాంతంలో ప్రమాద స్థాయి దాటవచ్చని, ఆ మేరకు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర జలసంఘం సూచించింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 2014 తర్వాత ఆరేళ్లకు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయడం గమనార్హం. నదీ పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

కొన్నేళ్లుగా భద్రాచలం వద్ద గరిష్ఠ నీటి మట్టాలి ఇలా..

* 2104 సెప్టెంబర్ 8న 56.1 అడుగులు

* 2015 జూన్ 22న 51 అడుగులు

* 2016 జూలై 12న 52.4 అడుగులు

* 2017 జూలై 20న 36.7 అడుగుల

* 2018 ఆగస్టు 22న 50.0 అడుగులు

* 2019 ఆగస్టు 9న 51.2 అడుగులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని