ఉరకలేస్తున్న గోదావరి
close

తాజా వార్తలు

Updated : 15/08/2020 13:08 IST

ఉరకలేస్తున్న గోదావరి

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ ఫ్లో 9.84లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం వద్ద కాజ్‌వే పూర్తిగా మునిగిపోవడంతో కనకాయలంక, బూరుగులంక, అరికెలవారిపేట, జి.పెదపూడి సహా పలు లంకగ్రామాలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వైనతేయ నది ఉప్పొంగడంతో మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేరుస్తున్నారు. గోదావరి ఉద్ధృతికి దేవీపట్నం సమీపంలో గండిపోచమ్మ ఆలయంలోకి వరదనీరు చేరింది. రహదారులపై వరదనీరు ప్రవహిస్తుండటంతో దేవీపట్నం మండలంలోని  36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి  ఉరకలేస్తోంది. ఎగువున భారీ వర్షాలు కురవడంతో నదిలో వరద ప్రవాహం ఎక్కువైంది. కొత్తూరు కాజ్‌వే వద్ద  పది అడుగుల మేర వరదనీరు చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

భద్రాచలం వద్ద ..
 పరివాహక ప్రాంతాలు, ఉపనదుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం 45 అడుగులకు చేరింది. మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఇప్పటికే అమలులో ఉందన్నారు. నేటి మధ్యాహ్న సమయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని