మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తాజా వార్తలు

Updated : 16/10/2020 16:54 IST

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ రాయితీలు ప్రకటించింది. వివరాలను మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. మెట్రో సువర్ణ ఆఫర్‌ కింద ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు  తెలిపారు. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుందని చెప్పారు. వరదల వల్ల నగరంలో రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణం కష్టంగా మారిందని.. ఈ క్రమంలోనే మెట్రోలో ప్రయాణాలకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాయితీలు ప్రకటించినట్లు వివరించారు. నగరంలో భారీ స్థాయిలో వరద ఉన్న రోజున ఒక గర్భిణి కోసం ప్రత్యేకంగా ఒక మెట్రో రైలును నడిపినట్లు చెప్పారు.

రాయితీల వివరాలు...
> స్మార్ట్‌ కార్డు ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం.
> 20 ట్రిప్పుల ఛార్జీలతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.
> 40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే  అవకాశం.

 టీ సవారీ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా నవంబరు 1 నుంచి..

> 7 ట్రిప్పులకు ఛార్జీ  చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం.
> 14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ..45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.
> 20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ... 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.

> 30 ట్రిప్పులకు ఛార్జీ  చెల్లిస్తే ... 45 రోజుల్లో 45  ట్రిప్పులు తిరిగే అవకాశం.

> 40 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ... 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం కల్పించినట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులను ప్రోత్సహించేందుకే ఈ రాయితీలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని