Top Ten News @ 9 PM
close

తాజా వార్తలు

Published : 07/05/2021 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 9 PM

1. AP: కరోనాతో 73 మంది మృతి

కరోనాతో బాధపడుతూ తాజాగా 73మంది మృతి చెందారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితిపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు చేయగా, 17,188 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి విడత టీకాలకు ప్రస్తుతం అవకాశం లేదని, రెండో డోస్‌ టీకాలు తీసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. త్వరలో మరో 3.50లక్షల డోసులు ఇచ్చేందుకు సీరం అంగీకారం తెలిపిందని వివరించారు. 

2. Night Curfew: తెలంగాణలో మళ్లీ పొడిగింపు

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర  ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా గత నెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. మొదట్లో మే 8వ తేదీ వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం మరోవారం పాటు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రజలు సమూహాలుగా ఉండకుండా పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 

3. ఏపీ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి: చంద్రబాబు

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇమ్మని కేంద్రం స్పష్టం చేస్తుంటే.. ఏపీ ప్రభుత్వం సాధ్యం కాదని చెప్పటం తగదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్‌ కోసం రాష్ట్ర నిధులు ఖర్చు పెట్టకుండా కేంద్రం అనుమతులు లేవంటూ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతమాత్రం సబబు కాదన్నారు. ప్రభుత్వ సహకారం లేనిదే కరోనా నియంత్రణ సాధ్యం కాదని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ తమ గళం గట్టిగా వినిపించి ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

4. Lockdown: కర్ణాటకలో పూర్తి లాక్‌డౌన్‌

కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టంచేశారు. కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ సత్ఫలితాలనివ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయంలో అన్ని హోటళ్లు, పబ్బులు, బార్లు మూసివేయాలని యడియూరప్ప ఆదేశించారు. 

5. Whatsapp డెడ్‌లైన్‌.. యూజర్లకు ఊరట

వాట్సాప్‌ వినియోగదారులకు ఊరట. గడువు ముగిసినప్పటికీ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయిన వారి ఖాతాలు డిలీట్‌ చేయబోమని వాట్సాప్‌ స్పష్టంచేసింది. ఇందుకోసం విధించిన మే 15 డెడ్‌లైన్ విషయంలో వెనక్కి తగ్గింది. ఆ గడువు దాటినప్పటికీ నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించకపోయిన ఖాతాలు కొనసాగుతాయని వాట్సాప్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే, ప్రైవసీ పాలసీని ఆమోదించాలన్న రిమైండర్లను మరికొన్ని వారాల పాటు యూజర్లకు పంపిస్తామని వాట్సాప్‌ ప్రతినిధి చెప్పారు. 

6. Oxygen పెంచండి..లేదంటే ప్రాణాలు పోతాయ్‌!

ప్రధాని మోదీకి పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆమె  మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పాడుతోందని లేఖలో పేర్కొన్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం అనూహ్యంగా పెరిగిపోతోందని, ప్రస్తుతం రోజుకు 470 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతోందని, రానున్న వారంలో రోజుల్లో ఇది 550 మెట్రిక్‌ టన్నులకు పెరిగిపోయే అవకాశముందని ఆమె తెలిపారు. 

oxygen: కేంద్రానికి సుప్రీంలో మరో ఎదురుదెబ్బ!

Covidపై వెంటనే అఖిలపక్షాన్ని పిలవండి..!

7. Third Wave అన్ని చోట్లా వస్తుందా?

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ వ్యాప్తి అలజడి సృష్టిస్తోంది. వేలాది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మూడోదశ వ్యాప్తి (థర్డ్‌ వేవ్‌) ముప్పు కూడా పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ప్రజల్లో భయం పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్‌ వేవ్‌ కూడా ఇప్పుడున్నంత తీవ్రంగా ఉంటుందా? దేశవ్యాప్తంగా థర్డ్‌ వేవ్‌ తప్పదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

8. WTC Final: టీమ్‌ఇండియా ఖరారు.. 

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమ్‌ఇండియాను ఎంపిక చేశారు. కాసేపటి క్రితమే బీసీసీఐ 25 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. మరోవైపు ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్‌కు సైతం ఇదే టీమ్‌ఇండియాను ప్రకటించడం గమనార్హం. 

9. నాలుగేళ్ల బాలుడు.. మృత్యువును జయించాడు!

బోరుబావిలోని 90అడుగుల లోతులో చిక్కుకున్న బాలుడు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ నిన్న బోరు బావిలో పడిపోయిన బాలుడిని అధికారులు 16గంటల పాటు తీవ్రంగా శ్రమించి కాపాడారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోరే జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్‌ దేవసి (4) అనే బాలుడు గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ బోరుబావిలో పడి 90 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. అక్కడ పనిచేసిన వారు చూసి గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా.. వారు పోలీసులకు చెప్పారు.

10. Elon musk: ఉత్పాదకత పెంపునకు 7 సూత్రాలు!

ప్రముఖ వ్యాపారవేత్త, సాంకేతిక నిపుణుడు ఎలాన్ మస్క్‌ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మస్క్‌.. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ ద్వారా అద్భుత విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతూ భవిష్యత్తు జీవన విధానానికి కావాల్సిన సాంకేతికతను సమకూరుస్తున్నారు. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సంచలనం సృష్టిస్తున్న టెస్లా..  చంద్రుడు, అంగారకుడిపై కాలనీలు, స్పేస్‌ టూరిజమే లక్ష్యంగా సాగుతున్న స్పేస్‌ ఎక్స్‌ ప్రయాణం మస్క్‌ ఆలోచనలకు మచ్చు తునకలు. 

రేపటి నుంచి టాటా వాహనధరల పెంపు

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని