Google: ఇక హై బ్రీడ్‌ వర్క్‌ వీక్‌
close

తాజా వార్తలు

Updated : 06/05/2021 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Google: ఇక హై బ్రీడ్‌ వర్క్‌ వీక్‌

న్యూదిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ఉద్యోగులు ‘హైబ్రిడ్‌ వర్క్‌ వీక్‌’ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు ఉద్యోగులు ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. మిగిలిన రెండు రోజులు ఉద్యోగుల ఇష్టం. వారికి పని చేయడం ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడి నుంచి విధులకు హాజరుకావచ్చని గూగుల్‌, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్పష్టం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి కూడా మొత్తం ఉద్యోగుల్లో 20శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయొచ్చని 60శాతం మంది మాత్రమే ఆఫీస్‌కు వస్తారని, అది కూడా వారం కొన్ని రోజులు మాత్రమేనని సుందర్‌ తెలిపారు.

‘‘ఉత్పత్తి ప్రాంతాలు, కార్యకలపాలను బట్టి ఏయే రోజుల్లో ఉద్యోగులు కలిసి పనిచేయాలన్నది నిర్ణయమవుతుంది. అప్పుడే బృంద సభ్యులు కలుస్తారు. పనిని బట్టి వారంలో మూడు, అంతకంటే ఎక్కువ రోజులు కలిసే అవసరం ఏర్పడవచ్చు. అది కూడా పనిని బట్టి ఉంటుంది’ అని సుందర్‌ పిచాయ్‌ అన్నారు. కొందరు ఉద్యగులకు పూర్తిగా రిమోట్‌ ద్వారా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు పిచాయ్‌ పేర్కొన్నారు. అయితే, బృందంలో వారి పాత్ర, బృంద అవసరాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు.

2021 మొదటి త్రైమాసిక గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో 139,995 మంది ఫుల్‌ టైమ్‌ ఉద్యోగులు ఉన్నారు. అయితే, ఏ దేశంలో ఎంతమంది పనిచేస్తున్నారన్న విషయాన్ని గూగుల్‌ వెల్లడించలేదు. సుమారు 4వేలమంది భారత్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. సెర్చ్‌, క్లౌడ్‌, పేమెంట్స్‌, ఏఐ రీసెర్చ్‌ విభాగాల్లో భారత్‌ నిపుణులు ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్‌, ముంబయి, గురుగ్రామ్‌లో ఎక్కువమంది పనిచేస్తున్నారు. ‘తాజాగా ప్రకటించిన మార్పులు త్వరలోనే అమలు అవుతాయి. 60శాతం మంది ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఆఫీస్‌కు వస్తారు. 20శాతం మంది కొత్త ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలకు వెళ్తారు. మరో 20శాతం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తారు’ అని పిచాయ్‌ వివరించారు. అదే విధంగా ఒక ఉద్యోగి ఏడాదిలో 4 వారాల పాటు ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయం నుంచి కాకుండా కొత్త ప్రాంతం నుంచి కూడా తాత్కాలికంగా పనిచేయొచ్చు. అందుకు మేనేజర్‌ అనుమతి అవసరం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని